సోషల్ నెట్ వర్క్ సైట్స్ లో విశేషంగా క్రేజ్ ఉన్న పేస్ బుక్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. పేస్ బుక్ ఫ్యాన్స్ పేజీలో బన్నీకి లక్షా యాబైవేలమంది ఫాలోవర్స్ రావటం విశేషం. దక్షిణాదిలోప్రముఖ తమిళనటుడు సూర్య తర్వాత స్థానాన్ని అల్లు అర్జున్ దక్కించుకున్నాడు.అంతే కాకుండా తెలుగుచిత్రసీమలో నెంబర్ వన్ ఫాలోవర్స్ ని సంపాదించిన ఏకైక హీరోగా నిలిచాడు. తెలుగుతో పాటు కేరళ, కన్నడ భాషల్లో కూడా అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఈ సందర్బంగా బన్ని స్పందిస్తూ.నెంబర్ వన్ సోషల్ నెట్ వర్స్ ఫేస్ బుక్.కామ్'లో తన పేరిట క్రియేట్ చేసిన ఫ్యాన్స్ పేజినీ లక్షా యాభై వేలమంది ఫాలోవర్స రావటం అదికూడా తెలుగులో అత్యధికంగా నిలపటం చాలా సంతోషంగా ఉందన్నాడు. తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానులకు,ప్రొత్సహిస్తున్న మీడియాకు,మరి ముఖ్యంగా వెబ్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు బన్నీ పేర్కొన్నాడు.
No comments:
Post a Comment